ప్రయోగాలు వద్దంటున్న రవితేజ..!!

 ప్రయోగాలు వద్దంటున్న రవితేజ..!!

మాస్ మహారాజ రవితేజ నెల టికెట్ సినిమా ఎలాంటి పరాజయం పాలైందో అందరికి తెలిసిందే.  ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంటే దారుణమైన రిజల్ట్ వచ్చింది.  ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నారు.  పూర్తి స్థాయి శ్రీను వైట్ల మార్క్ తో సినిమా ఉండబోతున్నది.  సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది.  ఈ సినిమా తరువాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు.  

మొదట వీరి కాంబినేషన్లో తేరి సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నారట.  నెల టికెట్ బెడిసి కొట్టడంతో.. రీమేక్ జోలికి వెళ్లి చేతులు కాల్చుకునే బదులు.. డైరెక్ట్ గా స్ట్రెయిట్ సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు.  రవి తేజ చెప్పినట్టుగానే సంతోష్ శ్రీనివాస్ కథను, స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టుగా సమాచారం.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, అన్ని అనుకున్నట్టుగా జరిగితే దసరా రోజున సినిమాను లాంచ్ చేస్తారని సమాచారం.  రవితేజ మాస్ హిట్ చాలా అవసరం.  మంచి హిట్ పడితేనే కెరీర్ తిరిగి గాడిలో పడుతుంది.