ఆగిందనుకున్న సినిమా మొదలైంది !

ఆగిందనుకున్న సినిమా మొదలైంది !

 

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.  సినిమా కూడా అధికారికంగా అయింది.  కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు.  తాజా సమాచారం మేరకు ఇన్నిరోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది.  మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోనే ఉంటుందట.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఇకపోతే రవితేజ ప్రజెంట్ విని ఆనంద్ డైరెక్షన్లో 'డిస్కో రాజ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.