మహేష్ సినిమాలో రాయలసీమ సీన్స్!

మహేష్ సినిమాలో రాయలసీమ సీన్స్!

గతంలో సీమ బ్యాక్ గ్రౌండ్ లో చాలా సినిమాలను తెరకెక్కించేవారు. స్టార్ హీరోలు సైతం రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. అయితే ఆ తరువాత ఫ్యాక్షన్ ను పెద్దగా టచ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మన హీరోలు సీమ వైపు చూడడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో సీమకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించబోతున్నారు. తాజాగా మహేష్ బాబు సినిమాకు కూడా సీమ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల 'భరత్ అనే నేను' చిత్రంతో సక్సెస్ 
అందుకున్న మహేష్ బాబు తదుపరి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం ఫారిన్ లో చిత్రీకరించనున్నారు. ఇక ఇండియాలో చూపించే సీన్స్ అన్నీ కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతాయని చెబుతున్నారు. మహేష్ ను రాయలసీమతో లింక్ చేస్తూ రూపొందించే ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  నిర్వహించనున్నారు.