కర్నూలులోనూ అదే సీన్... 

కర్నూలులోనూ అదే సీన్... 

ఇటీవలే చంద్రబాబు నాయుడు అమరావతి వెళ్లిన సంగతి తెలిసిందే.  అక్కడ పర్యటించే సమయంలో చంద్రబాబు నాయుడిపై కొంతమంది రైతులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.  కాగా, ఈరోజు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.  కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడుకు అమరావతి సీన్ రిపీట్ అయ్యింది.  కర్నూలులో విద్యార్థి, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడంతో పాటూ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో బాబును అడ్డుకున్నారు.  బాబును అడ్డుకున్న ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.