చంద్రబాబును కలిసిన రాయపాటి శ్రీనివాస్..

చంద్రబాబును కలిసిన రాయపాటి శ్రీనివాస్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టిపెట్టారు... అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు టికెట్‌ ఆశించేవారు చంద్రబాబును కలుస్తున్నారు. ఇవాళ ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్.. టీడీపీ అధినేతను కలిశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు ఇవ్వాలని కోరారు రాయపాటి శ్రీనివాస్... అయితే, పరిశీలిస్తానని రాయపాటి కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. రాయపాటి శ్రీనివాస్ వైపే టీడీపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం అందుతుండగా... రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయనున్నారు చంద్రబాబు.