కోహ్లీ, రాయుడు ఫిఫ్టీస్‌.. స్కోరెంతంటే..?

కోహ్లీ, రాయుడు ఫిఫ్టీస్‌.. స్కోరెంతంటే..?

వెస్టిండీస్‌తో విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 28వ ఓవర్ ముగిసేసరికి  జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు. కెప్టెన్ కోహ్లీ (54), అంబటి రాయుడు (58) పరుగులతో క్రీజులో ఉన్నారు. కళ్లుచెదిరే షాట్లతో ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. అంతకముందు టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది.ఆట 3వ ఓవర్‌లో జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ (4) అవుటయ్యాడు. స్కోరు 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు 8వ ఓవర్‌లో శిఖర్ ధవన్ (29) అవుట్ కావడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది.