ఐఎల్&ఎఫ్ఎస్ కేసులో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను సవాల్ చేసిన ఆర్బీఐ

ఐఎల్&ఎఫ్ఎస్ కేసులో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను సవాల్ చేసిన ఆర్బీఐ

ఐఎల్&ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీల రుణాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) వర్గీకరించే సందర్భంగా జాతీయ కంపెనీ చట్టం అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆర్బీఐ పిటిషన్ వేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవరించాలని పిటిషన్ లో అభ్యర్థించింది. ఆర్బీఐ వాదనలను వింటామని అప్పిలేట్ ట్రిబ్యునల్ లోని జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం తెలిపింది.

ఐఎల్&ఎఫ్ఎస్, 300కి పైగా గ్రూప్ కంపెనీల ఖాతాలపై రుణాలను చెల్లించడాన్ని నిలిపేస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించాలని కేంద్ర బ్యాంక్ తన పిటిషన్ లో కోరింది. ఈ కేసులోని శక్తులు తమ పరిధులు దాటి వస్తున్నాయని ఆర్బీఐ తరఫు న్యాయవాది వాదించారు.

ఐఎల్&ఎఫ్ఎస్ కేసుల పరిష్కారం సంద్భరంలో సాధించిన పురోగతిపై సమాచారం ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖను ట్రిబ్యునల్ కోరింది. అంతే కాకుండా రుణదాతల కమిటీ, పరిష్కార నిపుణుల నుంచి గ్రూపులోని ప్రతి కంపెనీకి సంబంధించిన తాజా సమాచారం ఇవ్వాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచించింది.