వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

మార్కెట్‌ ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును పావు శాతం తగ్గించడంతో ఈ రేటు ఇపుడు ఆరు శాతానికి చేరింది. మూడు రోజుల పాటు దేశ ఆర్థిక, బ్యాంకింగ్‌ పరిస్థితులను మదింపు చేసిన ఎంపీసీ కమిటీ కొద్దిసేపటి క్రితం తన నిర్ణయాన్ని ప్రకటించింది. హౌసింగ్‌  ఫైనాన్స్‌ సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని ఆర్బీఐ భావించింది. ప్రస్తుత ఆర్థిక ప్రథమార్థంలో జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశముందని పేర్కొంది. తొలి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.1 శాతం మధ్య ఉంటుందని, తదుపరి ఆరు నెలల్లో ఈ వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.4 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.