ఆర్బీఐ: మరోసారి తగ్గిన కీలక వడ్డీరేట్లు..

ఆర్బీఐ: మరోసారి తగ్గిన కీలక వడ్డీరేట్లు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది... ఇవాళ ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు వెల్లడించింది. అసలే ఆర్థిక మందగమనంతో ఆందోళన నెలకొన్న సమయంలో మరోసారి వడ్డీరేటు పావుశాతం తగ్గించింది ఆర్బీఐ.. దీంతో ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటు.. 5.15 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటు 4.90 శాతం, బ్యాంక్ రేట్‌ను 5.40 శాతంగా నిర్ణయించింది ఆర్బీఐ. ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి... 2020-21 సంవత్సరానికి గాను జీడీపీ అంచనాను 7.2గా సవరించింది సెంట్రల్ బ్యాంక్.