ఏం జరుగుతోంది? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!

ఏం జరుగుతోంది? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది... ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పొసగక గతంలో ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారనే ప్రచారం సాగగా.. ఇప్పుడు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామాకు సిద్ధమయ్యారు. ఆర్బీఐలో అతి పిన్న వయస్కుడైన డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యే కాగా... తన పదవీకాలం ముగియడానికి మరో ఆరు నెలల ముందు రాజీనామా చేస్తున్నారు. ఆర్‌బీఐకి స్వతంత్రత, స్వయంప్రతిపత్తి ఉండాలని గట్టిగా కోరినవారిలో విరాల్ ఆచార్య ఒకరు. కాగా, ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని జాతీయ మీడియా పేర్కొంటోంది. 2017 జనవరి 23న ఆర్బీఐలో చేరిన ఆయన.. ఆర్థిక విధానాల సరళీకరణ తర్వాత నుంచి చూస్తే యంగ్ డిప్యూటీ గవర్నర్ ఈయనే.. విరాల్ ఆచార్య పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత న్యూయార్క్‌లోని స్టెర్న్ బిజినెస్ స్కూల్‌లో విద్యార్థులకు బోధించనున్నారు. విరాల్ ఆచార్య రాజీనామా వార్తల నేపథ్యంలో వచ్చే నెల పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్న సీనియర్ డిప్యూటీ గవర్నర్ ఎన్. విశ్వనాథన్‌ను మరికొన్ని నెలలు కొనసాగమని కేంద్రం కోరే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది.