ఆర్బీఐ కొత్త రూల్స్.. మార్చి నుంచి అమల్లోకి...

 ఆర్బీఐ కొత్త రూల్స్.. మార్చి నుంచి అమల్లోకి...

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలకు తెరపడాలని రిజర్వు బ్యాంకు పట్టువదలని ప్రయత్నం చేస్తుంది. ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాల్లో వందల కేసులు నమోదవ్వడం సంస్థకు తలవంపులుగా మారింది. కార్డుల ద్వారా జరిగే మోసాలను వీలైనంత వరకూ తగ్గించడం లక్ష్యం పెట్టుకుంది. వాటిని ఎలా వాడాలన్నది పూర్తిగా కార్డుదారుల చేతిలోనే ఉండే విధంగా రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మార్చి 16 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. సాధారణంగా బ్యాంకులు డెబిట్‌ , క్రెడిట్‌ కార్డును జారీ చేసినప్పుడు అన్ని రకాల లావాదేవీలకు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇదే ఆన్‌లైన్‌, సైబర్‌ నేరాలకు కారణమవుతోంది. ఇకపై బ్యాంకులు కార్డులు జారీ చేసినప్పుడు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికీ,  పీఓఎస్‌ యంత్రాల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకే వీలయ్యేలా చూడాలని ఆర్‌బీఐ చెప్పింది. ఒకవేళ కార్డుదారుడికి ఆన్‌లైన్‌ సేవలు అవసరం అయితే.. అందుకోసం ప్రత్యేకంగా బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా కార్డు జారీ చేసినా.. పాత కార్డు స్థానంలో కొత్తది ఇచ్చినా.. ఇదే నిబంధన వర్తిస్తుంది. 

అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించేందుకు, ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావC3Eదేవీలకు సంబంధించి ..కార్డుపై ప్రత్యేక సేవలను బ్యాంకును సంప్రదించి పొందాల్సి ఉంటుంది. కార్డుదారుడికి అవసరం అయినప్పుడు మాత్రమే ఈ సేవలను యాక్టివేట్‌ చేయించుకోవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులలో ఏ సేవలు అందుబాటులో ఉండాలి.. వేటిని నిలిపి వేయాలి అనేది కార్డుదారుడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ మార్పు రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్ఛు.  మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఐవీఆర్‌ ద్వారా ఈ మార్పులు చేసుకోవచ్చు.