వెంటనే ఆ వడ్డీని మాఫీ చేయండి: ఆర్బీఐ

వెంటనే ఆ వడ్డీని మాఫీ చేయండి: ఆర్బీఐ

కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియంపై వడ్డీపై వడ్డీ విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.. రూ.2 కోట్ల వరకు ఉన్నరుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్నకేంద్రం నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. నిర్దేశించిన సమయంలోగా బ్యాంకులు దీనిని అమలు చేయాలని పేర్కొంది.