ఆన్‌లైన్‌ లావాదేవీలపై చార్జీలు రద్దు

ఆన్‌లైన్‌ లావాదేవీలపై చార్జీలు రద్దు

ఆన్‌లైన్‌లో ఆర్‌టీజీఎస్‌, నిఫ్ట్‌ పద్ధతిలో నగదు బదిలీపై ఎలాంటి చార్జీలు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. పరపతి విధానం ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు వెంటనే ఖాతాదారులకు వర్తింప జేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు ఆర్టీజీఎస్‌, నిఫ్ట్‌ బదిలీలపై వసూలు చేసిన చార్జీలు రద్దవుతాయి. 2010 తరవాత రెపో రేటును ఆరు శాతం దిగువకు రావడం ఇదే తొలిసారి.