బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ. 40,000 కోట్లు

బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ. 40,000 కోట్లు

ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాంకింగ్‌ రంగంలోకి అదనంగా రూ. 40,000 కోట్లు ప్రవేశపెట్టాలని భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాలు (ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌) ద్వారా ఈ మొత్తాన్ని తెస్తారు. రుణ మార్కెట్‌ రేట్లను సహేతుక స్థాయిలో ఉంచేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంటోంది. నవంబర్‌ నెలలో రూ. 40,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్‌లో లిక్విడిటీ పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. గడిచిన మూడు వారాల నుంచి మార్కెట్‌లో లిక్విడిటీ సమస్య ఉంది.