మార్కెట్ రేట్ కంటే త‌క్కువ ధ‌ర‌కే ప‌సిడి..! నేటి నుంచే అవ‌కాశం..

మార్కెట్ రేట్ కంటే త‌క్కువ ధ‌ర‌కే ప‌సిడి..! నేటి నుంచే అవ‌కాశం..

మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50వేల పైనే ప‌లుకుతోంది.. కానీ, మార్కెట్ రేట్ కంటే.. త‌క్కువ ధ‌ర‌కే బంగారాన్ని సొంతం చేసుకుని అవ‌కాశం వ‌చ్చింది.. మార్కెట్‌లో బంగారం ధ‌ర రూ.51 వేల చేరువ‌లో ఉండ‌గా.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని కేవ‌లం రూ.48,520కే సొంతం చేసుకోవ‌చ్చు.. 2020-21 సిరీస్ నాలుగో విడత కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.. ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతుంది. గ్రాము బంగారం ధరను రూ.4,852గా నిర్ణ‌యించింది ఆర్బీఐ.. అంటే, 10 గ్రాముల బంగారం కేవ‌లం రూ.48520 మాత్ర‌మే.. ప్ర‌స్తుత మార్కెట్‌లో బంగారం ధ‌ర కంటే ఇది చాలా త‌క్కువ‌. 

ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్‌తో పాటు ప‌లు బ్యాంకుల్లో ఈ గోల్డ్ బాండ్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.. స్టాక్ ఎక్స్చేంజీలు, పోస్టాఫీసుల్లో కూడా ఈ బాండ్లు సొంతం చేసుకోవ‌చ్చు. ఇక‌, అంతేకాదు.. ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్ల‌ను కొంటే.. గ్రాముకు అద‌నంగా మ‌రో రూ.50 త‌క్కువ‌కే ల‌భిస్తుంది. అంటే.. వ‌న్ గ్రామ్ గోల్డ్ బాండ్ రూ.4802కే పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఒక్కో వ్య‌క్తి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో గ్రాము నుంచి 4 కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.. అదే ట్రస్ట్‌లు, ఇతర సంస్థలు అయితే.. 20 కేజీల వరకు పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం ఉంటుంది. ఇలా కొనుగోలు చేసే గోల్డ్ బాండ్ల‌పై 2.5 శాతం వ‌డ్డీని కూడా  పొంద‌వ‌చ్చు.. బంగారం లాంటి అవ‌కాశం ఇవాళ్టి నుంచే ప్రారంభం.. మ‌రి త్వ‌ర‌ప‌డండి.