ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.28,000 కోట్ల తాత్కాలిక డివిడెండ్

ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.28,000 కోట్ల తాత్కాలిక డివిడెండ్

ప్రభుత్వానికి రూ.28,000 కోట్లు తాత్కాలిక డివిడెండ్ గా చెల్లించాలని ఆర్బీఐ కేంద్ర బోర్డు నిర్ణయించింది. కేంద్ర బ్యాంక్ ఇలా తాత్కాలిక డివిడెండ్ చెల్లించడం ఇది వరుసగా రెండో ఏడాది. దీంతో ప్రభుత్వ మొత్తం మిగులు రూ.68,000 కోట్లకు చేరింది. ఆర్థిక మూలధన ప్రణాళికను అమలు చేసిన తర్వాత నేటి తాత్కాలిక మిగులుపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర బ్యాంక్ ఇప్పటికే ప్రభుత్వానికి తాత్కాలిక డివిడెండ్ కింద రూ.40,000 కోట్లు చెల్లించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తాత్కాలిక డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వానికి చాలా కీలకమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి రూ.10,000 కోట్ల తాత్కాలిక డివిడెండ్ చెల్లించింది. తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగంలో పీయూష్ గోయల్ ప్రభుత్వం 3.3% లక్ష్యాన్ని 3.4%కి సవరించినట్టు ప్రకటించారు.