ఎస్ బ్యాంక్‌పై మారిటోరియం ముగుస్తుంది.. నో టెన్షన్..

ఎస్ బ్యాంక్‌పై మారిటోరియం ముగుస్తుంది.. నో టెన్షన్..

ఎస్ బ్యాంక్ సంక్షోభంపై క్లారిటీ ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్.. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్‌ బ్యాంకు డిపాజిట‌ర్ల సొమ్ము భ‌ద్రంగా ఉందని తెలిపారు. డిపాజిట‌ర్లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని భరోసా ఇచ్చిన ఆయన.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం.. ఎస్ బ్యాంకు అంశంలో త్వర‌గా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక, బ్యాంకుపై విధించిన మారిటోరియం బుధవారంతో ముగుస్తుందని.. ఆ త‌ర్వాత‌  కొత్త బోర్డు బాధ్యత‌లు స్వీక‌రిస్తుందని తెలిపారు. డిపాజిటర్లు డబ్బు పూర్తిగా భద్రంగాఉంది.. ఎలాంటి ఆందోలన చెందాల్సిన అవసరం లేదు.. ఎల్లుండి నుంచి డబ్బులు విత్‌డ్రా చచేసుకోవచ్చని తెలిపారు శక్తికాంత్‌దాస్.