సంక్రాంతి బరిలో చరణ్ ఉన్నాడు !

సంక్రాంతి బరిలో చరణ్ ఉన్నాడు !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమాపై గత కొన్ని రోజులుగా నేక రూమర్లు నడుస్తున్న తరుణంలో నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఒక ప్రకటన చేసింది.  అందులో ముందుగా చెప్పినట్టే సినిమా 2019 సంక్రాంతికి తప్పకుండా విడుదలవుతుందని తేల్చి చెబుతూ త్వరలోనే ఫస్ట్ లుక్ డీటైల్స్ ఇస్తామని అంది. 

ఇకపోతే సినిమా టాకీ పార్ట్ నవంబర్ 10కి ముగుస్తుందని, అప్పటికి ఇంకో రెండు పాటలు మాత్రమే మిగిలి ఉంటాయని, నవంబర్ 9 నుండి డబ్బింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.  వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తోంది.