'జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో వేరుగా పొత్తులు..'

'జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో వేరుగా పొత్తులు..'

రానున్న సాధారణ ఎన్నికల్లో జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయిల్లో పొత్తులు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుంతియా... ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తెలంగాణ నేతల భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన... సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడాలని పార్టీ చీఫ్ సూచించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అధిగమించి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని దిశా నిర్దేశం చేశారని వెల్లడించిన కుంతియా... పొత్తు విషయం చర్చించలేదు. కానీ, జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయిల్లో పొత్తులు వేరుగా ఉంటాయన్నారు.