సీఎం అవుతానని ముందే చెప్పాడు.. అంటే..?

సీఎం అవుతానని ముందే చెప్పాడు.. అంటే..?

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ఆర్‌సి కుంతియా     స్పందించారు. పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్ బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని.. దీనిని ఒక అప్రజాస్వామిక పాలనగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు..

బీజేపీ తీరుకు నిరసనగా ఈ నెల 18న దేశవ్యాప్తంగా ధర్నా చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుందని.. ఈ ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొని కర్ణాటకలో అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపాలని ఆయన కోరారు. 17 ఉదయం 9 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతానని యడ్యూరప్ప ముందే చెప్పారని.. అంటే ముందే వీరు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారా అని కుంతియా అనుమానం వ్యక్తం చేశారు. మా ఎంఎల్‌ఏలకు 100 కోట్ల ఆఫర్ వచ్చిందని సాక్షాత్తూ కుమారస్వామి చెప్పారని.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. ఇంత జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం వెనుక కారణం ఏంటని షబ్బీర్ అలీ ప్రశ్నించారు..