విలీనం ఎలా చేస్తారు..?

విలీనం ఎలా చేస్తారు..?

సీఎల్పీని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనంపై చేయడాన్ని తప్పుబట్టారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా... ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధర్వయంలో నిర్వహిస్తోన్న 'ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం'లో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించిన కుంతియా... స్పీకర్ దగ్గర ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లు ఉండగా... సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? అని ఆవేదన వ్యక్తం చేశారు కుంతియా.