విదేశాల్లో ఐపీఎల్ 2020 ... ఆర్సీబీ హ్యాపీ

విదేశాల్లో ఐపీఎల్ 2020 ... ఆర్సీబీ హ్యాపీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ సైమన్ కటిచ్ 2020 ఐపీఎల్ ను భారతదేశం వెలుపల నిర్వహించే ఆలోచనకు మద్దతు పలికాడు. నగదు అధికంగా ఉన్న ఈ ఐపీఎల్ లీగ్ ఈ సంవత్సరం ఏదో ఒక సమయం లో బీసీసీఐ నిర్వహిస్తుందనడంలో సందేహం లేదు అని అన్నాడు. వేగంగా వ్యాప్తి చెందుతున్నకరోనా మహమ్మారి నేపథ్యంలో బీసీసీఐ గురువారం ఐపీఎల్ ను "తదుపరి నోటీసు వచ్చేవరకు" నిలిపివేసింది. అయితే ఈ టోర్నీ ఆస్ట్రేలియా లేక దక్షిణాఫ్రికా లో నిర్వహిస్తే తమకు చాల మేలు జరుగుతుంది తమ జట్టు చాల సంతోష పడుతుందని అని తెలిపాడు. ఎందుకంటే ఆర్సీబీ జట్టు లో ఆ రెండు దేశాలకు సంబంధించిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. వారు తమ సొంత గడ్డపై చెలరేగుతారు అని అన్నాడు. అయితే ఇదివరకు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2009 లో దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు అదే కారణంతో, టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్లు 2014 లో యుఎఇలో జరిగాయి. అయితే టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బీసీసీఐ లక్ష్యంగా చేసుకోగల సమయం సెప్టెంబర్-నవంబర్ మాత్రమే అని తెలిపాడు.