ఐపీఎల్ లో ఆర్సీబీ ఒక గొప్ప, చెత్త రికార్డులను సృష్టించింది ఇదే రోజు...

ఐపీఎల్ లో ఆర్సీబీ ఒక గొప్ప, చెత్త రికార్డులను సృష్టించింది ఇదే రోజు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకసారి కూడా విజయం సాధించని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). అయితే ఈ జట్టు అభిమానుల మధ్య మంచి ప్రాచుర్యం పొందింది. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ మరియు విరాట్ కోహ్లీ వంటి ప్రపంచ స్టార్ ఆటగాళ్లు ఈ జట్టులో ఉండేవారు. కానీ 2018 నుండి గేల్ ఆ జట్టు తరపున ఆడటం లేదు. అయితే అంతక ముందు ఏప్రిల్ 23, 2013 న, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పూణే వారియర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీతో క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. అందులో మొత్తం 175 పరుగులు చేసిన గేల్ ఇప్పటికీ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గేల్ చెలరేగడం తో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేయడంతో ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డును సాధించింది. అయితే సరిగ్గా 4 సంవత్సరాల తరువాత 2017 ఏప్రిల్ 23 లో, ఈడెన్ గార్డెన్స్లో కోల్‌కతా నైట్ రైడర్స్ దాడిలో కేవలం 49 పరుగులు చేసి ఆల్ ఔట్ అయిన ఆర్సీబీ 89 పరుగుల తేడాతో పతనానికి గురైంది. దాంతో ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా చెత్త రికార్డు ను సొంతం చేసుకుంది. ఏది ఏమైనా అత్యధిక, అత్యల్ప పరుగుల రికార్డులు రెండు ఆర్సీబీ పేరు మీదే ఉండటం గమనార్హం.