బుమ్రా ఈ మ్యాచ్‌కీ అనుమానమే?
గురువారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆడడం అనుమానంగానే ఉంది. గాయం కారణంగా.. బుమ్రాకి మరింత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజటి మ్యాచ్‌లో బుమ్రా ఆడతాడో లేదో మ్యాచ్ మొదలయ్యే వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది. బుమ్రా జట్టు ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నా కూడా బౌలింగ్ సాధన చేయలేకపోవడంతో.. దాదాపు అడడనే సంకేతాలు సూచిస్తున్నాయి.
ఆదివారం డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి బంతికి బుమ్రా గాయపడ్డాడు. డిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ కొట్టిన షాట్‌ను ఆపబోతుండగా.. బుమ్రా కింద పడ్డాడు. ఎడమ భుజంకి బలంగా గాయం కావడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానంలోనే పడుకున్నాడు. అనంతరం ఫిజియో వచ్చి చికిత్స చేసాడు. పెవిలియన్‌కు వెళ్లిన బుమ్రా .. ముంబయి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో వికెట్ పడ్డా కూడా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడి గాయంపై అందరికి అనుమానాలు నెలకొన్నాయి. అయితే బుమ్రా కోలుకున్నాడని, అతడికి పెద్ద గాయం కాలేదని ముంబయి ఇండియన్స్ యాజమాన్యం, బీసీసీఐ ప్రకటించాయి. మరోవైపు బుమ్రాకి మరింత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రా ఆడడంపై ఉత్కంఠ నెలకొంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)