ఆర్డీఎక్స్ లవ్ ట్రైలర్ టాక్ : అమ్మాయిలు వేటాడితే.. !!

ఆర్డీఎక్స్ లవ్ ట్రైలర్ టాక్ : అమ్మాయిలు వేటాడితే.. !!

ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్, ఆ తరువాత చాలా కాలం వరకు ఖాళీగా ఉన్నది.  ఖాళీగా ఉంటూనే సోషల్ మీడియాలో వరసగా ఫోటోలు షేర్ చేస్తూ దూసుకుపోయింది ఈ హీరోయిన్. దీంతో ఇప్పుడు ఈ హీరోయిన్ ఆర్డిఎక్స్ లవ్ సినిమా చేసింది.  ఈ సినిమా టీజర్ బోల్డ్ గా ఉండటంతో విమర్శలు ఎదుర్కొన్నది.  ఆ తప్పు చేయకుండా స్టోరీ చుట్టూ కథను నడిపేలా ట్రైలర్ ను కట్ చేశారు.  

అనగనగ ఒక ఊరు.  ఆ ఊరికి ఓ సమస్య ఉన్నది.  ఆ సమస్యను పరిష్కరించేందుకు గ్రామం మొత్తం ఏకం అవుతుంది.  అదే సమయంలో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇస్తుంది. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతుంది.  అసలు ఆ ఊరికి వచ్చిన సమస్య ఏంటి... పాయల్ రాజ్ పుత్ కు ఆ సమస్యకు సంబంధం ఏంటి అన్నది ఆర్డి ఎక్స్ లవ్.  ట్రైలర్ థ్రిల్లింగ్ గా ఉండటంతో ఆకట్టుకుంది.  అబ్బాయిలు వేటాడితే..సింహం కూడా కుక్కపిల్లగా మారుతుంది అని చెప్పడం విశేషం.