చంద్రగిరిలో రీపోలింగ్‌ ప్రారంభం.. భారీ బందోబస్తు..

చంద్రగిరిలో రీపోలింగ్‌ ప్రారంభం.. భారీ బందోబస్తు..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ‌వర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ప్రారంభమైంది... మొదట ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌పై ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతో తాజాగా మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ ఫిర్యాదులతో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తి ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

1. పోలింగ్ కేంద్రం 321 (ఎన్ ఆర్ కమ్మపల్లి).. మొత్తం ఓటర్లు 698 మంది కాగా... పురుషులు 336, మహిళలు 362 మంది.
2. పోలింగ్ కేంద్రం  104 (పుల్లివర్తిపల్లి) మొత్తం ఓటర్లు 805 మంది కాగా... వీరిలో పురుషులు 391, మహిళలు 414 మంది.
3. పోలింగ్ కేంద్రం  316 (కొత్త కండ్రిగ).. మొత్తం ఓటర్లు 991 మంది.. వీరిలో పురుషులు 482 మంది, మహిళలు 509 మంది.
4. పోలింగ్ కేంద్రం 318 (కమ్మపల్లి)..  మొత్తం ఓటర్లు 1028 మంది... వీరిలో పురుషులు 490, మహిళలు 538 మంది.
5. పోలింగ్ కేంద్రం 313 (వెంకట్రామపురం).. మొత్తం ఓటర్లు 377 మంది... వీరిలో పురుషులు 179, మహిళలు 198 మంది.
6. పోలింగ్ కేంద్రం 310 (కాలేపల్లి).. మొత్తం ఓటర్లు 597 మంది.. వీరిలో పురుషులు 295 మంది, మహిళలు 302 మంది. 
7. పోలింగ్ కేంద్రం 323 (కుప్పం బాదురు).. మొత్తం ఓటర్లు 955 మంది. వీరిలో పురుషులు 465 మంది, మహిళలు 490 మంది.