5 రీపోలింగ్ కేంద్రాల్లో 4,834 మంది ఓటర్లు

5 రీపోలింగ్ కేంద్రాల్లో 4,834 మంది ఓటర్లు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్‌ఆర్ కమ్మపల్లి-321, కమ్మపల్లి-318 పోలింగ్ కేంద్రాలు, పులివర్తిపల్లి-104 పోలింగ్ కేంద్రం, కొత్తకండ్రిగ-316, వెంకట్రామపురం-313 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 4,834 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేది ఆదివారం ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఏర్పాట్లు చేసుకోవాలని స్ధానిక అధికారులకు సమాచారం అందింది. ఎన్ఆర్ కమ్మపల్లి పోలింగ్ కేంద్రంలో 698 మంది ఓటర్లు ఉండగా.. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ లో 658 ఓట్లు పోలయ్యాయి. పులివర్తిపల్లిలో మొత్తం ఓటర్లు 805 గా ఉంటే.. 765 మంది, కొత్తకండ్రిలో 991 మందికి 812, కమ్మపల్లిలో 1,028కి 925, వెంకట్రామపురంలో 377 ఓట్లకు గాను 323 ఓట్లు ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ లో పోలయ్యాయని తెలిపింది.