దిశ కేసు: రీపోస్టుమార్టం పూర్తి.. సీల్డ్ కవర్‌లో నివేదిక...!

దిశ కేసు: రీపోస్టుమార్టం పూర్తి.. సీల్డ్ కవర్‌లో నివేదిక...!

దిశపై అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తైంది... ఆ నాలుగు మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ శాఖ అధిపతి సుధీర్ గుప్తాతో పాటు అభిషేక్ యాదవ్, ఆదర్శ్ కుమార్ వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించింది... మృతదేహాలకు ఎక్స్‌రే తీసిన తర్వాత వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. రీపోస్టుమార్టాన్ని మొత్తం వీడియో చిత్రీకరించారు. అయితే, ఈ రీపోస్టుమార్టానికి సంబంధించిన నివేదికను ఇవాళ సాయంత్రం సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించనున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. ఇక, రీపోస్టుమార్టం పూర్తి కావడంతో.. కాసేపట్లో మృతదేహాలకు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు గాంధీ ఆస్పత్రి వైద్యులు...