ఆప్‌కు నాలుగు సీట్లు ఇస్తాం

ఆప్‌కు నాలుగు సీట్లు ఇస్తాం

ఢిల్లీలో నాలుగు లోక్‌సభ సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి ఆఫర్‌ చేసింది కాంగ్రెస్‌. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.  'ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరితే బీజేపీకి ఘోర ఓటమే. ఢిల్లీలో కేజ్రివాల్‌కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు మేము రెడీ. అయితే కేజ్రివాల్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. పొత్తు కోసం మా తలుపులు తెరిచే ఉన్నాయి. కాని సమయం మించిపోతోంద'ని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

వివిధ రాష్ట్రాలతో కలిపి తమకు మొత్తం 33 సీట్లు కావాలని కేజ్రివాల్‌ డిమాండ్‌ చేస్తున్నారు.  చర్చలు జరుగుతున్నాయ్‌... రాహుల్‌ ట్వీట్‌కు కేజ్రివాల్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. 'యూ టర్న్‌ ఎక్కడ? ఇంకా చర్చలు జరుగుతున్నాయి కదా? మీ ట్వీట్‌ చూస్తుంటే పొత్తుకు మీరు ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మీ ఉత్తుత్తి మాటలు చూస్తుంటే నాకు దుఃఖమేస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని మోడీ నుంచి కాపాడాల్సి ఉంది. యూపీతో సహా వివిధ రాష్ట్రాల్లో మోడీ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా మీరు మోడీకి సాయం చేస్తున్నార'ని కేజ్రివాల్‌ ట్వీట్‌ చేశారు.