హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రియల్ స్టార్ శ్రీహరి కొడుకు

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రియల్ స్టార్ శ్రీహరి కొడుకు

రియల్ స్టార్ శ్రీహరి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎన్నో సినిమాలు చేశారు.  కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే హఠాత్తుగా అనారోగ్యంతో మరణించారు.  ఇప్పుడు ఆయన కుమారుడు మేఘంష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  నటనలో శిక్షణ తీసుకున్న మేఘంష్ కోసం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాను రెడీ చేశారట.  రాజ్ దూత్ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కబోతున్నది.  

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు కార్తీక్.. అర్జున్ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారట.  త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  రాజ్ దూత్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.