'రియల్‌మి 3' విడుదల

'రియల్‌మి 3' విడుదల

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొద్దిసేపటికి క్రితం న్యూఢిల్లీలో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. గ్లోబల్ వెర్షన్, ఇండియా వెర్షన్లలో లభించనుంది. గ్లోబల్‌ వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, ఇండియా వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. హీలియో పీ70, హీలియో పీ60 రెండూ కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్లే. దీని ధర సుమారు రూ.10,000లు ఉండొచ్చు. రియల్‌మి 3 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. డ్యూయెల్ కెమెరాలు కూడా ఉన్నాయి.