మణికర్ణికను క్రిష్ వదిలేయడానికి కారణం ఇదేనా..?

మణికర్ణికను క్రిష్ వదిలేయడానికి కారణం ఇదేనా..?

మణికర్ణిక ప్రాజెక్ట్ ను మొదట క్రిష్ హ్యాండిల్ చేశాడు.  చాలా వరకు నిర్మాణం పూర్తయింది.  టైటిల్ పాత్రను పోషిస్తున్న కంగన.. ఈ పాత్రకోసం చాలా కష్టపడింది.   గుర్రం స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంది.  షూటింగ్ దశలో ఉండగా.. తన సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకున్న కంగనా.. ఆ సంఘటన నుంచి బయటపడ్డాక సినిమా షూటింగ్ ముగుస్తుంది అనుకున్నారు.  అక్కడి నుంచే అసలు కథ మొదలౌతుందని ఎవరూ ఊహించలేదు.  

క్రిష్ తో ఉన్న విభేదాలు అంతకంతకు ఎక్కువయ్యాయి.  దీంతో క్రిష్ ఆ ప్రాజెక్టును వదిలేసి ఎన్టీఆర్ బయోపిక్ ను హ్యాండిల్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు.  మణికర్ణిక స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్నప్పటి నుంచే క్రిష్ తో కంగనా విభేదించేంది.  షూటింగ్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికి అవి బయటపడలేదు.  షూటింగ్ చివరి దశకు చేరుకోగానే ఆ విభేదాలు బయటపడ్డాయి.  

క్రిష్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాక.. దానిని కంగనానే హ్యాండిల్ చేయడం మొదలు పెట్టింది.  తనకు నచ్చని వ్యక్తులను పక్కన పెట్టేసి, షూటింగ్ చేసింది. అనుకున్నట్టుగానే మణికర్ణిక టీజర్ టీజర్ ను రిలీజ్ చేసింది.  క్రిష్ ను గౌరవిస్తూ టైటిల్ కార్డులో క్రిష్ పేరు వేసింది.  సినిమాలో కూడా అతనిపేరే ఉండొచ్చని అంటున్నారు.  మణికర్ణికను జనవరి 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.