సవ్యసాచి ఆలస్యానికి కారణాలివే 

సవ్యసాచి ఆలస్యానికి కారణాలివే 

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సవ్యసాచి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కుతోంది. మొదట్లో ఈ సినిమాని జూన్ మాసంలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినా, షూటింగ్ షెడ్యూల్స్ వల్ల జూలై నెలకి వాయిదా పడింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అప్పటికి ఈ చిత్రం రెడీ కాకపోవచ్చని తెలుస్తోంది. 

దీనికి సంబంధించిన కారణాలు చూస్తే సినిమాలో గ్రాఫిక్ కంటెంట్ ఎక్కువగా ఉందట. ఈ పనిని టెక్నీకల్ టీంలోని ఓ వ్యక్తి తన ఫ్రెండ్ మొదలెట్టిన స్టార్ట్ అప్ కి అప్పగించారట. తీరా ఫైనల్ అవుట్ ఫుట్ అసలు బాగాలేకపోవడంతో చందు మొండేటి తీవ్ర నిరాశకు గురయ్యాడట. దింతో బాహుబలి సినిమాకు గ్రాఫిక్స్ అందించిన మకుట సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారట. సో ఇక ఆ పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా ఓ నెల పాటు సమయం కావడంతో ఆగష్టు నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య ఇందులో రెండు చేతులతో ఎలాంటి పనినైనా అవలీలగా చేసే వాడిలాగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.