చైనాలో 2.0 ఆగిపోవడానికి కారణం ఇదేనా ?

చైనాలో 2.0 ఆగిపోవడానికి కారణం ఇదేనా ?

రజినీకాంత్ హీరోగా చేసిన 2.0 సినిమా ఇండియాలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.300 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఈ మూవీని చైనాలో రిలీజ్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు.  అనుకున్న ప్రకారం సినిమా జులై 12 వ తేదీన రిలీజ్ చేయాలి.  

జూన్ 28 వ తేదీన ఈ సినిమా ప్రీమియర్ షోను వేయాలని అనుకున్నారు.  అయితే, జులై 19 వ తేదీన డిస్ని ది లయన్ కింగ్ సినిమా రిలీజ్ ఉండటంతో సినిమా రిలీజ్ 2పాయింట్ 0 సినిమా రిలీజ్ ను హెచ్ వై మీడియా రద్దు చేసుకోవాలని అనుకుంటోందని సమాచారం.  అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  చైనాలో దాదాపు 56వేల స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఒకవేళ రిలీజ్ చేస్తే సినిమా కనీసం $25 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించాలి.  వారం రోజుల్లో ఈ కలెక్షన్లు సాధ్యం కాకపోవచ్చు.  ఈ భయంతోనే సినిమా రిలీజ్ ను రద్దు చేసుకున్నారని సమాచారం.