బాలయ్య...బోయపాటి సినిమా ఆలస్యానికి కారణం ?

బాలయ్య...బోయపాటి సినిమా ఆలస్యానికి కారణం ?

బాలకృష్ణ చేసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే  కసితో ఉన్నాడు.  అందుకోసమే కలిసొచ్చిన బోయపాటితో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  స్టోరీకు కూడా సిద్ధం అయ్యింది.. త్వరలోనే ప్రారంభం కాబోతున్నదని వార్తలు వచ్చాయి.  

ఏమైందో ఏమో తెలియదుగాని, సడెన్ గా సినిమా వాయిదా పడింది.  బడ్జెట్ ఎక్కువగా ఉండటంతోనే సినిమా వాయిదాపడిందని వార్తలు వస్తున్నాయి.  సినిమాను రూ.30 నుంచి రూ.40 కోట్ల రూపాయల మధ్యలోనే పూర్తి చేయాలనీ బాలకృష్ణ చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది.  అదేమంటే..రవికుమార్ సినిమాకు బాలయ్య ఓకే చేశారని, ఆ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని, దీంతో బోయపాటి సినిమాను పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి.  మరి ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.