విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగలేకపోవడానికి ఇదే కారణామా? 

విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగలేకపోవడానికి ఇదే కారణామా? 

చంద్రయాన్ 2 ను ఇస్రో జులై 22, 2019 న ఇస్రో శ్రీహరి కోట నుంచి ప్రయోగించింది.  పీఎల్ఎస్వీ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లింది.  వివిధ దశలను దాటుకొని సెప్టెంబర్ 7 వ తేదీన చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మరో 500 మీట్లర్ల దూరంలో ఉండగానే భూమితో సంబంధాలు కోల్పోయి హార్డ్ గా ల్యాండింగ్ జరిగింది.  ఇలా హార్డ్ ల్యాండింగ్ జరగడం వలన ల్యాండర్ విక్రమ్ దెబ్బతిన్నది.  

మరో నిమిషంలో ల్యాండింగ్ జరగబోతుంది అనగా ఇలా పడిపోవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆరాతీశారు.  సాఫ్ట్ ల్యాండింగ్ లో తలెత్తిన సమస్యలపై ఆరాతీశారు.  విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం తయారు చేసిన సాఫ్ట్ వేర్ ట్రయల్ రన్ లో ఎలాంటి లోపాలు తలెత్తలేదు.  అయితే, ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయి చంద్రుని పై 30 కిలోమీటర్లు చక్కగా ప్రయాణం చేసింది.  రఫ్ బ్రేకింగ్ నుంచి ఫైన్ బ్రేకింగ్ కు చేరుకునే సమయంలోనే అసలు సమస్య తలెత్తింది.  సెకనుకు 146 మీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు.  అయితే విక్రమ్ సెకనుకు 750 మీటర్ల వేగంతో ప్రయాణం చేసింది.  విక్రమ్ ను అదుపుచేసే క్రమంలోనే.. అది చంద్రునిపై హార్డ్ గా ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.