సమంతా అలకకు కారణం ఏంటి..?

సమంతా అలకకు కారణం ఏంటి..?

'రంగస్థలం','మహానటి' వంటి సినిమాల హిట్స్ తో నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంది సమంతా. 'రంగస్థలం' సినిమా రిలీజ్ కు ముందు తరువాత సినిమాను ప్రమోట్ చేయడంలో సహకారాన్ని అందించిన సమంతా 'మహానటి' విషయంలో మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా ఉందని అంటున్నారు. నిజానికి 'మహానటి' సినిమాలో ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పని చేశారు. సినిమా సక్సెస్ క్రెడిట్ అందరికీ దక్కుతుంది కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది మాత్రం కీర్తి సురేష్ నటన గురించే.. దర్శకనిర్మాతలు కూడా ఆమెనే కీర్తించడంతో సమంతా మహానటి టీమ్ పై అలిగిందని టాక్.

సినిమా రిలీజ్ తరువాత సమంతతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయాలని మహానటి టీమ్ భావిస్తే సమంతా మాత్రం వాళ్లకు రెస్పాండ్ కావడం లేదని సమాచారం. ఆమెను రీచ్ అవ్వడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా సమంతా మాత్రం ఎవరికీ అందుబాటులోకి రావడం లేదట. సమంతతో ప్రమోషన్స్ చేయించడం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావించిన చిత్రబృందానికి నిరాశే ఎదురవుతుంది. కానీ ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.