తేజ తప్పుకోవడానికి అసలు కారణం ఇదా..?

తేజ తప్పుకోవడానికి అసలు కారణం ఇదా..?

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే.  సినిమాకు న్యాయం చేయలేను అనే ఉద్దేశ్యంతో పక్కకు తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.  బయటకు తేజ కూడా అలాగే చెప్పాడు. ఒత్తిడి కూడా ఒక కారణం అని కొన్నాళ్ళు టాక్ నడిచింది.  తేజ పక్కకు తప్పుకోవడానికి అసలు విషయం అదికాదని మరో టాక్ వినిపిస్తోంది.  నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయం సాధించడంతో.. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు భారీ రెమ్యునరేషన్ వస్తుందని తేజ భావించాడు.  ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇలాగే ఆలోచించాడట.  కొన్ని ఏరియాలను తేజ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.  కానీ, బాలకృష్ణ మాత్రం తేజకు ఓ రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసి, దానికే కట్టుబడి ఉన్నాడట.  ఇది తేజకు నచ్చలేదని.. అందుకే ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.