యాత్ర పోస్ట్ ఫోన్ కు కారణం ఇదేనా..?

యాత్ర పోస్ట్ ఫోన్ కు కారణం ఇదేనా..?

వైఎస్సాఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర.  మలయాళం హీరో మమ్మూట్టి ఇందులో వైఎస్సాఆర్ రోల్ ప్లే చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  గతంలో ఈ సినిమా రిలీజ్ ను కూడా ప్రకటించాడు మహి.  అనుకున్నట్టుగా యాత్ర డిసెంబర్ 21 న రిలీజ్ కావాల్సి ఉంది.  ఎందుకో తెలియదుగాని రిలీజ్ కు వారం రోజుల ముందుగా సినిమాను పోస్ట్ ఫోన్ చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది.  

ఫిబ్రవరి 8 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న యాత్ర ఎందుకు పోస్ట్ ఫోన్అయినట్టు.  కారణం ఏంటి..?  డిసెంబర్ 21 వ తేదీన వరుణ్ తేజ్ అంతరిక్షం 9000 కిలోమీటర్లు, శర్వానంద్ పడిపడిలేచే మనసు, కన్నడ రాక్ స్టార్ నటించిన భారీ యాక్షన్ సినిమా కేజీఎఫ్ లు రిలీజ్ అవుతున్నాయి.  ఈ మూడు సినిమాలు మూడు వేరువేరు జానర్లో రావడమే కాకుండా.. సినిమాలపై అంచనాలు కూడా పెంచుకున్నాయి.  మరోవైపు 2పాయింట్ 0 సినిమా ఏ క్లాస్ సెంటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడింది. వరుణ్, శర్వానంద్, కేజీఎఫ్ వంటి సినిమాలకే థియేటర్లు దొరకడం చాలా కష్టం అవుతుంది.  యాత్ర బయోపిక్ సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు కావాలి.  అందుకే సినిమాను వాయిదా వేసి ఉండొచ్చని సమాచారం.  జనవరిలో వరసగా పెద్ద సినిమాలు ఉన్నాయి.  జనవరి ఎండింగ్ వరకు సినిమా రిలీజ్ కు సరైన సమయం దొరక్కపోవడంతో సినిమాను ఫిబ్రవరి 8 వ తేదీకి వాయిదా వేసి ఉండొచ్చు.