సూర్య... శివ సినిమా ఆలస్యం కారణం ఇదే..

సూర్య... శివ సినిమా ఆలస్యం కారణం ఇదే..

టాలీవుడ్ లో గోపీచంద్ తో శౌర్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ.. తమిళంలో అజిత్ తో వరసగా నాలుగు సినిమాలు చేసి నాలుగు హిట్స్ కొట్టాడు.  రీసెంట్ గా వచ్చిన విశ్వాసం సినిమా సంచలన విజయం సాధించింది.  ఈ సినిమాతో శివ టాప్ దర్శకుల స్థాయికి ఎదిగాడు.  

ప్రస్తుతం శివ కోలీవుడ్ హీరో సూర్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా మే నెలాఖరు నుంచి మొదలుకావాలి.  కానీ, శివ ఆరోగ్యం బాగాలేకపోవడంతో సినిమా వాయిదా పడింది.  శివ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.  వచ్చే నెల మొదటివారంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారట.