మళ్లీ మొదటికి..? 'కుమార'సంకటం..!

మళ్లీ మొదటికి..? 'కుమార'సంకటం..!

సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్షలో కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం గట్టెక్కుతుందా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరుకాకుండా ముంబైలోనే ఉండే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే కాక.. బలపరీక్షలో పాల్గొనాలా? లేదా? అనే విషయాన్ని ఎమ్మెల్యేల ఇష్టానికే వదిలేసింది. దీంతో రెబల్స్ బలపరీక్షకు దూరంగా ఉండే యోచనలో ఉన్నారు. రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలు.. బలపరీక్షకు హాజరుకాకపోతే మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీ బలం 107కు చేరుకోనుండగా... జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ బలం మాత్రం 101కే  పరిమితం అవుతుంది. దీంతో, కుమారస్వామి బలపరీక్ష గండం తప్పేలా లేదు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప.. ఇప్పుడున్న బలంతో.. సంకీర్ణ సర్కార్ విశ్వాసపరీక్ష నెగ్గడ మాత్రం కష్టంగా ఉంది.