తెలంగాణకు పట్టిన పీడ ముందే వీడింది

తెలంగాణకు పట్టిన పీడ ముందే వీడింది

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలపై ప్రజా గాయకుడు గద్దర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణకు పట్టిన పీడ 9 నెలల ముందే వీడిందన్నారు. త్యాగాల తెలంగాణ సాధనలో ప్రజాభిప్రాయం మేరకు బరిలో దిగుతానని తెలిపారు. 70 ఏళ్ల జీవితంలో తొలిసారి ఓటు హక్కును రిజిష్టర్ చేసుకున్న అని గద్దర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో యువత రాజకీయ శక్తిగా ఎదగాలని సూచించారు.