ధూమ్ 4 లో రెబల్ స్టార్ ..?

ధూమ్ 4 లో రెబల్ స్టార్ ..?

బాలీవుడ్లో ధూమ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సిరీస్ కి  ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు  సీక్వెల్స్ వచ్చాయి. మొదటి సిరీస్ లో జాన్ అబ్రహాం,రెండవ సిరీస్ లో హృతిక్ రోషన్,మూడవ సిరీస్ లో అమిర్ ఖాన్ నటించారు. ఈ మూడు సిరీస్ లు కూడా  బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

ప్రస్తుతం అందరి చూపు ‘ధూమ్4’ పైనే ఉంది.‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు 600 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.  కచ్చితంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలి. మొదట ఈ సినిమాకి హీరోగా షారుఖ్ ఖాన్ పేరు వినిపించింది .కానీ ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదు.ఈ సినిమాకి నేషనల్ వైడ్ పాపులారిటీ సాధించిన హీరో కావాలి అందుకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అయితేనే.. ఈ భారీ ప్రాజెక్టుకి కరెక్ట్ అని వారు భావిస్తున్నారట.  

‘ధూమ్4’ ప్రభాస్ తోనే తెరకెక్కించాలని నిర్మాత ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది. ‘బాహుబలి2’ విడుదలైనప్పటి నుండీ ఆదిత్య చోప్రా అదే పనిలో ఉన్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'రాధేశ్యామ్' సినిమా ,నాగ్ అశ్విన్ తో ఓ సినిమా,అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అవి పూర్తయితేనే కానీ.. ‘ధూమ్4’ ఓకే అవుతుందని చెప్పలేము. ఇక ధూమ్ 4 లో ప్రభాస్ నటిస్తే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త నిజం కావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.