ప్రభాస్ ఏ లుక్ తో ఆకట్టుకుంటాడు?

ప్రభాస్ ఏ లుక్ తో ఆకట్టుకుంటాడు?

బాహుబలిగా ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అయితే ఆ తర్వాత వచ్చిన 'సాహో' బాహుబలి సాగాను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత కమిట్ అయిన 'రాధే శ్యామ్' కూడా అనుకున్న టైమ్ లో పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిలించి వరుస సినిమాలు కమిట్ అయ్యాడు ప్రభాస్. ఓ వైపు 'రాధేశ్యామ్'కు ఫినిషింగ్ టచ్ లు ఇస్తూ మరోవైపు ఇంకో రెండు సినిమాల చిత్రీకరణ మొదలుపెట్టాడు. 'కెజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో 'సలార్', బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో 'ఆదిపురుష్' సినిమాల షూటింగ్స్ కూడా ఆరంభించేశారు. ఇవి మూడూ ప్యాన్ ఇండియా సినిమాలు కావటం... ఈ మూడింటిలో ప్రభాస్ లుక్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండటం గమనించాల్సిన విషయం.

ఇంత షార్ట్ టైమ్ లో మూడు సినిమాలకు మూడు రకాల లుక్స్ మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. పూర్తి స్థాయిలో డెడికేషన్ ఉండాలి. తాజాగా  'జాతిరత్నాలు' ట్రైలర్ లాంచ్ లో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ లుక్ 'సలార్' లో క్యారక్టర్ కోసమంటున్నారు. ఇందులో ప్రభాస్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. ఆ మధ్య ముంబైలో కోరమీసంతో కనిపించిన లుక్ 'ఆదిపురుష్' కోసమట. ఇక 'రాధే శ్యామ్' లో ట్రిమ్డ్ గడ్డం మీసాలతో ప్రభాస్ కనిపించబోతున్నాడు. మరి మూడు లుక్స్ లో ఏ లుక్ ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూద్దాం.