మరో రికార్డ్ సాధించిన ప్రభాస్... సౌత్ లో మొదటి హీరోగా.. 

మరో రికార్డ్ సాధించిన ప్రభాస్... సౌత్ లో మొదటి హీరోగా.. 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ప్రభాస్‌కు బాహుబలి సినిమా నుండి రికార్డులు తిరగరాయడం అలవాటుగగా మారింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అందుకున్న అభిమానులను మాత్రం నిరాశాపరిచింది. అయిన కూడా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్  ఉపయోగించే ఒక్కేఒక్క సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్‌. ఇక ఇప్పుడు అందులో కూడా ఓ రికార్డు సాధించాడు ప్రభాస్. ఫేస్ బుక్ లో 15 మిలియన్ల మంది  ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పటివరకు సౌత్ హీరోలలో ఒకరు కూడా ఆ మార్క్ ను అందుకోలేకపోయారు. గత నెలలో 14 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్‌కు కేవలం ఒక నెలలోనే ఒక మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. ఇక ప్రభాస్ తర్వాత రెండవ స్థానం లో 13 మిలియన్ల  ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ ఉండగా  ఆ తర్వాత దాదాపు 10  మిలియన్ల ఫాలోవర్స్ తో మహేష్ బాబు ఉన్నాడు.