చరిత్ర సృష్టించిన నోవాక్ జకోవిచ్...

చరిత్ర సృష్టించిన నోవాక్ జకోవిచ్...

సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇటాలియన్ ఓపెన్ టైటిల్ అందుకున్న తర్వాత జకోవిచ్ ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే ఇప్పటివరకు జకోవిచ్, నాదల్ 35 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ అందుకున్న ఆటగాళ్లగా సమానంగా ఉన్నారు. కానీ ఈ విజయంతో నాదల్ ను వెనక్కి నెట్టిన జకోవిచ్ 36వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ అందుకున్న ఆటగాడిగా మొదటి స్థానంలో నిలిచాడు. ఇటాలియన్ ఓపెన్ ఫైనల్ లో డియెగో ను 7-5, 6-3 తేడాతో ఓడించి జకోవిచ్ టైటిల్ అందుకున్నాడు. ఇక ఛాంపియన్ గా నిలిచిన జకోవిచ్ కు కోటి 77 లక్షల ప్రెస్ మనీ లభిచింది. అయితే ఈ ఏడాది జకోవిచ్ కు ఇది నాలుగో టైటిల్ కావడం విశేషం. అయితే యూఎస్ ఓపెన్ కూడా అందుకోగల సత్తా ఉన్న ఈ ఆటగాడు తన నిర్లక్ష్యం తో ఆ టోర్నీలో నుండి వెనుదిరిగాడు.