మయాంక్‌ ఖాతాలో ఇదీ రికార్డు..!

మయాంక్‌ ఖాతాలో ఇదీ రికార్డు..!

తొలి టెస్టులోనే అదరగొట్టిన టీమిండియా యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఓ రికార్డు కూడా నమోదు చేశాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేసిన  మయాంక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 118 పరుగులు చేసిన మయాంక్‌.. విదేశీ గడ్డపై తొలి టెస్టులో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 132 పరుగులతో సునీల్‌ గవాస్కర్‌ తొలి స్థానంలో ఉన్నాడు.