3400 స్క్రీన్లలో 'సర్కార్' విడుదల !

3400 స్క్రీన్లలో 'సర్కార్' విడుదల !

స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' చిత్రం ఈ నెల 6వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.  భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని  నిర్మించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మొదటి రోజే వీలైనంత పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ దక్కించుకోవాలని నిర్మాశ్చయించుకుంది. 

అందుకే సుమారు 3400 స్క్రీన్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  కేవలం తమిళనాడులోనే తొలిరోజు 25 కోట్ల గ్రాస్ రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారట నిర్మాతలు.  చూడాలి మరి ఈ టార్గెట్ ను వాళ్ళు అందుకోగలరో లేదో.  మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో కూడ 6వ తేదీనాడే విడుదలచేయనున్నారు.