తిరుపతిలో రెడ్ అలెర్ట్..! ఏం జరుగుతోంది..?

తిరుపతిలో రెడ్ అలెర్ట్..! ఏం జరుగుతోంది..?

తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు పోలీసులు... తమిళనాడులో ఉగ్రవాదులు చొరబాటు కారణంగా అప్రమత్తమైన పోలీసులు యంత్రాంగం.. విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. జిల్లా మొత్తం శ్రీకాళహస్తి నుండి తిరుమల వరకు, చిత్తూరు జిల్లా సరిహద్దుల వద్ద క్షుణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హైవేలపై డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తారు. జిల్లా మొత్తం పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసులను సూచించారు ఎస్పీ. అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు గాని కనిపిస్తే వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక, తిరుపతి, తిరుమల, శ్రీ కాళహస్తి ఆలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు.