ఈ నెల 19న భారత్ లో రెడ్ మి గో లాంచ్

ఈ నెల 19న భారత్ లో రెడ్ మి గో లాంచ్

షావోమీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ రెడ్ మి గోని ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. ఇప్పుడు షావోమీ ఈ ఫోన్ ని భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ రెడ్ మి గో లాంచ్ ఈవెంట్ ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ మార్చ్ 19న లాంచ్ కానుంది. మార్చ్ 19న జరిగే గో లాంచ్ ఈవెంట్ కి షావోమీ మీడియా ఆహ్వానాలు పంపింది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో రెడ్ మి గోని లాంచ్ చేస్తారు. రెడ్ మి గో స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, 1జీబీ, 8జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో వస్తోంది.

షావోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ ఈ ఫోన్ లాంచ్ టీజర్ ను హిందీలో ట్వీట్ చేశారు. టీజర్ లో ఉపయోగించిన భాష చూస్తే రెడ్ మి గో లాంచ్ అయ్యే అవకాశాలను దృఢపరుస్తోంది. టీజర్ ట్వీట్ లో ఒక మైక్రోసైట్ లింక్ కూడా ఉంది. పేజ్ లో రెడ్ మి గో ఫోన్ కి సంబంధించిన అనేక వివరాలు ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్), క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, హెచ్ డి డిస్ ప్లే తో వస్తోంది. కంపెనీ ఈ ఫోన్ లో హిందీ గూగుల్ అసిస్టెంట్, 20 భాషలకు సపోర్ట్, ప్రత్యేక మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఇవ్వనున్నట్టు తెలిపింది.

రెడ్ మి గో ధర 
రెడ్ మి గో జనవరిలో లాంచ్ అయింది. ఫిలిప్పీన్స్ మార్కెట్ లో దీని ప్రీ ఆర్డర్ బుకింగ్ సుమారుగా రూ.5,400 నుంచి ప్రారంభమైంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.5,000 కంటే తక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి షావోమీ అత్యంత చౌకైన ఫోన్ రెడ్ మి 6A రూ.5,999కి అమ్ముడవుతోంది. 

రెడ్ మి గో స్పెసిఫికేషన్స్ 
రెడ్ మి గో ఒక డ్యుయల్ సిమ్ స్మార్ట్ ఫోన్. ఇది ఆండ్రాయిడ్ గోతో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5 అంగుళాల హెచ్ డి (1280X720 పిక్సెల్) డిస్ ప్లే ఉంది. 16:9 యాస్పెక్ట్ రేషియో, 296 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇందులో 1.4 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, ఎడ్రెనో 308 జీపీయు, 1జీబీ ర్యామ్ ఇచ్చారు. రెడ్ మి గో బ్లూ, బ్లాక్ రంగుల్లో రానుంది. ఇందులో 1జీబీ/8జీబీ, 1జీబీ/16జీబీ వేరియంట్లు ఉన్నాయి.

షావోమీకి చెందిన ఈ ఫోన్ వెనక భాగంలో ఎఫ్/2.0 అపర్చర్ 8ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. తక్కువ వెలుగులో ఫోటోలు తీసేందుకు ఎల్ఈడీ ఫ్లాష్ అమర్చారు. హెచ్ డిఆర్, బర్స్ట్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్, స్మార్ట్ సీన్ మోడ్స్ కెమెరా యాప్ లు వస్తాయి. రియర్ కెమెరాతో యూజర్లు 1080 పిక్సెల్ రిజల్యూషన్ వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ ప్యానెల్ లో ఎఫ్/2.2 అపర్చర్ 5ఎంపీ సెల్ఫీ సెన్సర్ ఉంటుంది. రెడ్ మి గోలో మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి 128జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు.